AboutUs

Heal yourself from the Jaundice.

వైద్యం చేస్తూ తనకు కలిగిన సంతానానికి ఈ సేవలో తరియించే భాగ్యాన్ని అందించిన గొప్ప ఖ్యాతి పొందిన ఆదర్శమైన వ్యక్తి మారుమూల పల్లెటూరు గ్రామం అయినప్పటికీ వెళ్ళ గ్రామం నేడు ఎంతో ఘనత చెందిన గ్రామంగా మారింది. వైద్య నిలయంగా మారింది. ఎంతో అభివృద్ధి సాధించింది. అంటే దానికి మూల పురుషుడు ఆనాల సూర్యనారాయణ రావు గారు ఎంతోమందికి వివాహాలు చేసి కుటుంబాలుగా మలిచి వైద్య సేవ అందించమని ఆయన తర్వాత ఈ వైద్య సేవ అంతరించిపోకూడదని గ్రామంలో చాలా మందికి ఈ వైద్యవృత్తిని దానంగా ఇచ్చిన మహా త్యాగి ప్రాణదానం తో పాటు అన్ని కుటుంబాలు ఈ సేవ చేయాలని కోరుకున్న గొప్ప సాత్విక స్వభావం కలిగిన వ్యక్తి నిస్వార్థంతో ఎటువంటి ధనాపేక్ష లేకుండా సేవ చేసిన మహా ఋషి ఆనాల సూర్యనారాయణ రావు గారు. ఆనాల సూర్యనారాయణ రావు గారి కుటుంబంలో కొందరు వైద్య సేవకు అంకితం కాగా మరి కొందరు ఇతర వృత్తుల్లో పదిలమయ్యారు. వారిలో ఆనాల సూర్యనారాయణ రావు గారు కుమార్తె ఆనాల నారాయణమ్మ ఎడ్ల నారాయణమ్మ గారు ఈ ఆయుర్వేదంలో తన అత్తగారి ఇంటి వద్ద అనగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి వైద్యం అందించారు.

ఆనాల సూర్యనారాయణ రావు గారి భార్య అయిన ఆనాల సూర్యనారాయణమ్మ గారు భర్త అడుగుజాడల్లో నడుస్తూ కామెర్లకు, మూర్చరోగానికి, నీరుడు రోగానికి, మూలశంఖం, సులువు ప్రసూతికి ఆయుర్వేదంలో 1909 నుండి అనువంశికంగా మందులు స్వతహాగా ప్రకృతి సిద్ధంగా తయారు చేసి ఇచ్చేవారు. దీనితో ప్రజలు దీర్ఘకాలికంగా బాధపడే వ్యాధుల నుండి ఉపశమనం పొందేవారు. తాను బ్రతికిన కాలమంతా తన చేతులుతో మందుల్ని దంచి నూరి, రాతిరాళ్లను రోకళ్లను ఉపయోగించి సహజసిద్ధంగా మందులు తయారీకి ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత తరం అయిన ఆనాల సూర్యనారాయణ రావు గారి పెద్ద కుమార్తె మరియు వారి కుమార్తె ఆనాల భాగ్యలక్ష్మి గారు తాత ముత్తాతలు, తల్లి గారి బాటలో ఆయుర్వేద మందులు తయారు చేసి కొత్తగా సక్రమించే వ్యాధులకు కూడా మందులు తయారు చేయిగలిగిన ప్రతిభా ఆనాల భాగ్యలక్ష్మి గారిది, మరియు ఆనాల శ్రీనివాసరావు గారిది. ఆనాల భాగ్యలక్ష్మి గారి తర్వాత తరానికి చెందిన ఆనాల గంగాభవాని (కుమార్తె), ఆనాల మణికంఠ స్వామి నాయుడు (కుమారుడు), ఆనాల కనకదుర్గ (కుమార్తె) ఈ ఆయుర్వేదంలో గొప్ప ఘనత సాధించి విశిష్ట కీర్తి సంపాదించుకున్నారు. ఆనాల భాగ్యలక్ష్మి గారి మందు శశి సంతోషి ఆయుర్వేదం వెల్ల నుండి వివిధ రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు, ఇతర గ్రామాలకు ఎంతో ప్రసిద్ధిగాంచినవి.

కామెర్ల వైద్యులు ఆనాల శ్రీనివాసరావు గారు 3 వ తరం

పచ్చకామెర్ల వైద్యులు మణికంఠ స్వామి నాయుడు ఆనాల గంగభవాని ఆనాల కనక దుర్గ

అమ్మగారు ఆనాల భాగ్యలక్ష్మి గారు

దానిలో భాగంగా ప్రతిరోజు ఆనాల సూర్యనారాయణ రావు గారి వైద్య నిలయంలో ఆనాల సూర్యనారాయణ రావు గారి పేరు మీద (1909) ప్రతి రోజు కామెర్ల మందు ఇవ్వబడుతుంది. అలాగే శశి సంతోషి ఆయుర్వేదం వెల్లా నందు ఇతర దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు ఇవ్వబడతాయి. దూర ప్రాంతాల వారికి అవసరం అయినచో కొరియర్ ద్వారా పంపబడతాయి . ఈ శశి సంతోషి ఆయుర్వేదం వెల్ల నందు వైద్య సేవతో పాటు ఇతర సేవలకు ఎల్లప్పుడూ ప్రతీకగా ఉంటారు ఈ ఆవాల వంశం వారు. కరోనా సమయంలో ఎంతోమందికి పేషెంట్లకు ఆహారం నీరు కొరత ఏర్పడిన సమయాల్లో మూడు సంవత్సరాల పాటు వారికి కలిగిన దానిలో ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు దారిలో కొనుక్కోవడానికి అందుబాటులో లేని సమయంలో కూడా ఎంతో సహకారం చేశారు.

కరోనా సమయంలో మందులు ఇస్తూ వచ్చిన వారికి పాలు భోజనం ఉచితంగా అందించిన ఘనత. ఆనాల వారి ఫొటోస్.

కరోనా సమయంలో ప్రజల మధ్యలో, కరోనా బాధితుల మధ్యలో ఉండి మందులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం.ప్రాణాలకు తెగించి మరీ వైద్య సేవను అందించిన ఘనత ఆనాల వారి వంశానిదే. ఆనాల వారి వంశంలో వెలసిన ఆనాల వారి ఆడపడుచు అయినా ఆనాల కుంతీదేవి జాతర మహోత్సవం 400 సంవత్సరాల చరిత్ర నిదర్శనం . ఆనాల కుంతి జాతర టీవీ 9 ఆనాల వారి వంశ చరిత్ర ఘన చరిత్ర, అపూర్వ చరిత్ర నేటి తరానికి ఆదర్శం. విరాళాల సేకరించబడవు, ఫీజులు తీసుకోబడవు, ప్రతిరోజు కామెర్లకు లభించును. దూర ప్రాంతాల వారికి కొరియర్ సర్వీసు కలదు, ఉచిత సలహాలు ఇవ్వబడును.

Contact

Thank you for visiting our site. If you have any questions, feedback, or just want to say hello, don't hesitate to get in touch with us.

Copyright © 2024 All rights reserved GATEWAY WEBS